Vinod Varma’s character from ‘Ari’ has been unveiled: పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ‘అరి’ అనే సినిమా తెరకెక్కింది. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ బ్యానర్ పై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ‘అరి’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించిన వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఓ పెద్ద లైబ్రరీలో ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేసుకుంటున్న వినోద్ వర్మ స్టిల్ ఆసక్తికరంగ్ కనిపిస్తోంది. ‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ‘అరి’ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా హిందీ రీమేక్ పై బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్, తమిళ రీమేక్ మీద శివ కార్తికేయన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ‘అరి’ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి తదితరులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.