Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్. పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగ ఎదురుచూస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమానుంచి రెండో పాటను విడుదల చేసింది. చోళ చోళ అంటూ సాగే ఈ సాంగ్ లో విక్రమ్ చోళ వంశ ప్రాధాన్యతను చెప్పుకొచ్చాడు. ఇక ఈ సాంగ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
ఇక ఈ వేదికపై విక్రమ్ మాట్లాడుతూ “నాకు, మణిరత్నం సర్ తో ఒక స్పెషల్ రిలేషన్ ఉంది. రావణ్ తరువాత ఇప్పుడు ఇది. ఆయన చాలా అర్ధం చేసుకొనే మనిషి. ఆయన సినిమాలో నేను కూడా ఉన్నాను అంటే అది నా డ్రీమ్.. ఇప్పుడు నిజమయ్యింది. ఎప్పుడు చెప్తాను.. శంకర్ సర్ మూవీలో, మణి సర్ మూవీలో నటిస్తే ఆ తరువాత నేను రిటైర్ అయినా పర్లేదు అనుకునేవాడిని. ఆయన సినిమాలో ఇలాంటి మంచి పాత్ర నాకు రావడం భాగ్యం అది. నన్ను ఈ పాత్రకు తీసుకున్నందుకు థాంక్స్ మణి సర్..” అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా టీజర్ లోని డైలాగ్ చెప్పి మెప్పించాడు. ప్రస్తుతం విక్రమ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.