Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆయన నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ విడుదలకు మాత్రం ఇంకా లైన్ క్లియర్ కాలేదు. విజయ్ సీఎం అయితే ఈ సినిమా సమస్యలన్నీ చకచకా తీరిపోతాయని ఫ్యాన్స్ భావించారు. కానీ పరిస్థితి మాత్రం అలా లేదు సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇంకా హోల్డ్‌లోనే ఉండిపోయింది.
మొదట ఈ చిత్రాన్ని మే నెలాఖరున బక్రీద్ కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడేలా కనిపించడం లేదు. దాంతో చిత్ర యూనిట్ ఇప్పుడు కొత్తగా జూన్ 19ను రిలీజ్ డేట్‌గా పరిశీలిస్తోంది. విజయ్ బర్త్‌డే జూన్ 22 కంటే మూడు రోజుల ముందే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం ద్వారా అభిమానులకు ఒక భారీ బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ప్లాన్ వర్కవుట్ అవ్వాలన్నా సెన్సార్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమాలోని కొన్ని కీలక సీన్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2026 ప్రారంభం నుండి ఈ చిత్రం పలుమార్లు రివైజింగ్ కమిటీ ముందుకు వెళ్లినా సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నిరంతర ఆలస్యం వల్ల చిత్ర నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్స్ పై భారీగా ఆర్థిక భారం పడుతోంది. సినిమా థియేట్రికల్ డీల్స్‌తో పాటు ఓటీటీ బిజినెస్ కూడా ప్రస్తుతం హోల్డ్‌లో పడిపోయాయి. ప్రతి వారం ఆలస్యం అయ్యే కొద్దీ సినిమా వడ్డీలు, ఖర్చులు పెరిగిపోతుండటంతో మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
-
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
-
Ricky Ponting-PBKS: ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్.. సెటైర్లు వేసిన ఆర్ అశ్విన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..