Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ప్రస్తుతం విజయ్ లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపైనే విజయ్ ఆశలన్నీ ఉన్నాయి. ఈ ఏడాది వచ్చిన వారసుడు భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక అంతేకాకుండా ఈ సినిమా కాకుండా మరో సినిమా చేసి.. విజయ్ సినిమాలకు దూరం కానున్నాడు. అందుకే చివరి చిత్రాలను భారీ బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఇక విజయ సినిమాల విషయం పక్కన పెడితే.. ఆయన కుటుంబ విషయాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా ఉంటాయి. ఎందుకంటే .. విజయ్.. ఆయన తండ్రి చంద్రశేఖర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అందుకు కారణం.. విజయ్ కు ఇష్టం లేకుండా చంద్రశేఖర్.. విజయ్ పేరుమీద ఒక పార్టీని పెట్టడం.. అది తనకు సంబంధించింది కాదు అని విజయ మీడియా ముందే అధికారికంగా చెప్పడం జరిగాయి. ఇక అప్పటినుంచి తండ్రీకొడుకుల మధ్య విబేధాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.
Bindu Madhavi: ఇంత చూపించినా.. తెలుగమ్మాయికి అవకాశాలు రావట్లేదు ఎందుకో.. ?
ఇక తాజాగా ఆ విబేధాలకు చెక్ పెట్టాడు విజయ్. తండ్రికి ఆనారోగ్యం అని తెలిసి.. విదేశాల నుంచి ఆగమేఘాల మీద ఇండియాకు వచ్చి తండ్రివద్దకు చేరుకున్నాడు. చంద్రశేఖర్ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ మధ్యనే ఆయనకు గుండె ఆపరేషన్ అయ్యింది. ఇక లియో షూటింగ్ తరువాత విదేశాలకు వెకేషన్ కు వెళ్లిన విజయ్ .. ఇండియా కు వచ్చి రాగానే తండ్రి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులతో విజయ్ దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి తండ్రికి ఆరోగ్యం బాగోలేదని వెళ్లాడా.. ? విబేధాలు లేవు అని చెప్పడానికి వెళ్లాడా ..? అనేది తెలియాల్సి ఉంది.