విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ , వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుంచో సర్ ప్రైజ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొన్నటి నుంచి మేకర్స్ ఊరిస్తున్న ‘లైగర్ హంట్ థీమ్’ లిరికల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. విక్రమ్ మాంట్రోస్ ఈ థీమ్ సాంగ్ కు ట్యూన్ కంపోజ్ చేయగా.. హేమచంద్ర తనదైన శైలిలో ఆలపించాడు.
“బతకాలంటే గెలవాల్సిందే.. లెగు.. లెగు. ఎగరాలంటే రాగలాల్సిందే.. లెగు.. లెగు “అంటూ సాగిన లిర్టిక్స్ గూస్ బంప్స్ ను తెప్పిస్తున్నాయి. భాస్కర్ బట్ల రాసిన మోటివేషనల్ సాంగ్స్ లో ఈ సాంగ్ కూడా చేరిపోవడం ఖాయం. ముంబై లో ఒక స్ట్రీట్ లో టీ అమ్ముకునే కుర్రాడు.. ఎలా మార్షల్ ఆర్ట్స్ లో ఛాంపియన్ గా మారాడు అనేది ఈ సాంగ్ లో చూపించారు. ఇక బాక్సింగ్ రింగ్ లో విజయ్ బీస్ట్ ను గుర్తుచేశాడు. రౌడీ హీరో యాటిట్యూడ్, పూరి మాస్ ఎలివేషన్స్ తో ఈ సాంగ్ మంచి హైప్ ను తెచ్చుకొంది. నిజం చెప్పాలంటే ఈ సాంగ్ తో ఈ సినిమా హైప్ రెండింతలు పెరిగింది. ఇక పోస్టర్ లో విజయ్ కండలు తిరిగిన దేహం బాక్సాఫీస్ ను షేక్ చేసేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులను వెర్రెక్కిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్ – ఛార్మి కౌర్ – కరణ్ జోహార్ – అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షుకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో పాన్ ఇండియా రికార్డ్స్ ను రౌడీ హీరో ఏ రేంజ్ లో బద్దలుకొడతాడో చూడాలి.