Vijay Deverakonda : లుక్ మార్చిన హీరో… ‘జన గణ మన’ కోసం కొత్త మేకోవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ‘లైగర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ రింగుల జుట్టుతో, సిక్స్ ప్యాక్ బాడీతో బాక్సర్ మేకోవర్ లో కన్పించి అభిమానులను ఆకట్టుకున్నాడు. గత రెండేళ్లుగా ఒకే స్టైల్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు సరికొత్త లుక్ లో మరింత హ్యాండ్సమ్ గా కన్పించాడు. టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ విజయ్ దేవరకొండ ‘లైగర్’ కోసం ఇన్నాళ్లూ పొడవాటి జుట్టుతో కన్పించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రైమ్ వాలీబాల్ లీగ్ కోసం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో విజయ్ కనిపించాడు. ఆ ఫోటో కాస్తా వైరల్ కావడంతో ఆయన కొత్త లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపు రెండేళ్ల తర్వాత విజయ్ తన అభిమానులను కొత్త అవతార్‌తో ట్రీట్ చేశాడు.
Read Also : Sebastian PC 524’s Trailer : హీరోకు రే చీకటి చిక్కులు… ఒక్కడికి కూడా బాధ లేదు !
Also Read
- Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
- The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
- Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ - జక్కన్న మూవీ!
వైరల్ ఫోటోలో విజయ్ పసుపు రంగు టోపీ, నీలిరంగు చొక్కా ధరించాడు. తల్లి మాధవితో కలిసి ఆయన వాలీబాల్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నాడు. విజయ్ దేవరకొండ న్యూ లుక్ ను చూసిన నెటిజన్లు తన నెక్స్ట్ మూవీ “జన గణ మన” కోసమే ఈ మేకోవర్ అంటున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమాలో మైక్ టైసన్ కీలకపాత్రలో, అనన్య పాండే కథానాయికగా కనిపించనుంది.
తాజావార్తలు
-
Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!