స్టార్స్ కు కరోనా కష్టాలు స్టార్ట్… మళ్ళీ షూటింగ్ క్యాన్సిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి మరోసారి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు థర్డ్ వేవ్ భయాందోళనలను సృష్టిస్తున్నాయి. ఒకవైపు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మహేష్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, విశ్వక్ సేన్, నితిన్ వైఫ్ షాలిని, తాజాగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కు కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా మొదలైనప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితులే మరోమారు ఇండస్ట్రీలో స్టార్ట్ అవుతోంది. గతంలో కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడడమే కాకుండా షూటింగులు సైతం ఆగిపోయాయి. ఇక చాలా సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదు. తాజాగా మళ్ళీ అదే పరిస్థితి ఎదురు కాబోతోంది.
Read Also : మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్… తగ్గిన టికెట్ ధరలు
Also Read
- Suriya - Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' సెన్సార్.. 'A' సర్టిఫికెట్
- Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
‘లైగర్’ విజయ్ దేవరకొండ కూడా తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన పెంపుడు కుక్కతో కలిస్ ఉన్న పిక్ ను షేర్ చేస్తూ “స్పష్టంగా మరొక తుఫాను. షూటింగ్ రద్దు అయ్యింది” అంటూ కోవిడ్-19 కారణంగా ‘లైగర్’ షూట్ క్యాన్సిల్ అయ్యిందనే విషయాన్ని వెల్లడించారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ. ఈ సినిమాను కన్నడ, తమిళ, మలయాళంలో కూడా డబ్ చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్, అనన్యతో పాటు ‘లైగర్’ రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్పాండే కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 25న ఈ పాన్ ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?