మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్… తగ్గిన టికెట్ ధరలు

టికెట్ ధరలు పెరిగిపోయాయని బాధపడుతున్న ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్. తాజాగా థియేటర్లలో సినిమా టికెట్ ధరలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించిన వెంటనే, టాలీవుడ్ నిర్మాతలు ధరలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. వారి అభ్యర్థనను అంగీకరించిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ థియేటర్లలో టికెట్ ధరలను పెంచుకోవచ్చంటూ జీవో కూడా జారీ చేసింది. అయితే ఈ జీవో విడుదలైన కొద్ది రోజులకే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి భారీ చిత్రాలు వాయిదా పడ్డాయి.

Read Also : ఏపీ సీఎం జగన్ కు ఆర్జీవీ హెచ్చరిక

మరోవైపు చిన్న సినిమాలను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయరని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. కరోనా కేసులు కూడా పెరుగుతుండడంతో ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూస్తారా ? అనే అనుమానాలు బలపడుతున్నాయి. అందువల్ల ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్‌లకు తిరిగి తీసుకురావడానికి హైదరాబాద్‌ లోని మల్టీప్లెక్స్‌ లు టిక్కెట్ ధరలను సవరించాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు థియేటర్లలో టికెట్ ధరలు రూ.200, రూ.175, రూ.150గా ఉంటాయి. ఇప్పటి నుంచి కొత్తగా విడుదలయ్యే సినిమాలకు ఈ రేట్లు వర్తిస్తాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సీజన్‌లో బంగార్రాజు, రౌడీ బాయ్స్,డీజే టిల్లు, సూపర్ మచ్చి, హీరో వంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles