Vijay Devarakonda : విజయ్ దేవరకొండ చాలా మెచ్యూర్ గా ముందుకెళ్తున్నాడు. తనకు స్టార్ డమ్ వచ్చిన తర్వాత చేసిన మిస్టేక్స్ ను కవర్ చేసుకుంటూ చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు. గతంలో మాదిరిగా ఏది పడితే అది మాట్లాడకుండా ఒక లెవల్ లో ఉంటున్నాడు. వరుసగా పెద్ద సినిమాలను లైన్ లో పెడుతున్న విజయ్.. చిన్న హీరోలకు అండగా ఉంటున్నాడు. మనకు తెలిసిందే కదా ఈ మధ్య విజయ్ ఏ హీరో పిలిచినా సరే ఆ సినిమా ఈవెంట్లకు వెళ్తూ మాట్లాడుతున్నాడు. లిటిల్ హార్ట్స్, సూర్య మూవీ, ది గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాల సక్సెస్ మీట్లకు వచ్చి వాళ్లకు తన సపోర్ట్ అందించాడు. ఇప్పుడు మరో సినిమాకు కూడా ఇలాగే సపోర్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు.
Read Also : Raju Weds Rambai : రాజు వెడ్స్ రాంబాయి.. వెంటాడుతున్న నేటివిటీ ప్రాబ్లమ్
మొన్న థియేటర్లలోకి వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. త్వరలోనే దీని సక్సెస్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ ను రమ్మని కోరగా వచ్చేందుకు ఓకే చెప్పేశాడంట. ఇలా చిన్న హీరోల సినిమాల ఈవెంట్లకు వెళ్తూ తనవంతు సపోర్ట్ అందిస్తున్నాడు. విజయ్ కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి వచ్చి మంచి పాపులర్ అయ్యాడు. ఇప్పుడు తన వంతు బాధ్యతగా తనలాంటి వాళ్లకు అండగా నిలుస్తుండటంపై ఇండస్ట్రీలో మంచి ప్రశంసలు వస్తున్నాయి.
Read Also : Shraddha Kapoor : నా కండరాలు చితికిపోయాయి – శ్రద్ధా కపూర్ హెల్త్ వీడియో వైరల్