Raju Weds Rambai : రాజు వెడ్స్ రాంబాయి.. ఇప్పుడు సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న మూవీ ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఏకంగా తొమ్మిది సినిమాలతో పోటీ ఉన్నా సరే రాజు వెడ్స్ రాంబాయి అదరగొడుతోంది. అన్ని సినిమాల కంటే దీని మీదనే మంచి హైప్ క్రియేట్ అయిపోయింది. అంచనాలకు తగ్గట్టే మూవీ బాగానే ఆడుతోంది. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్ మరియు మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి నేటివిటీ సమస్య వచ్చి పడింది.
Read Also : Ram Charan Chikiri : సెంచరీ కొట్టిన చికిరీ..మరో రికార్డు!
ఈ సినిమా కథ పూర్తిగా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. తెలంగాణ యాసలోనే మూవీ ఉంటుంది. దీంతో నైజాంతో పాటు తెలంగాణ జిల్లాల్లో మంచి కలెక్షన్లు రాబడుతోంది. కానీ ఏపీలో మాత్రం కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అక్కడ పెద్దగా సినిమాకు హైప్ రావట్లేదు. తెలంగాణ నేటివిటీ ఉండటంతోనే ఏపీలో పట్టించుకోవట్లేదనే ప్రచారం జరుగుతోంది. అందుకే తెలంగాణలో ఈ మూవీకి వస్తున్నట్టు ఏపీలో హైప్ రావట్లేదు. కానీ మూవీ మాత్రం కలెక్షన్లలో దూసుకుపోతోంది. రిలీజ్ అయినే మూడు రోజుల్లోనే ఏకంగా రూ.7 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టింది. ఒకవేళ ఏపీలో కూడా టికెట్లు తెగితే కలెక్షన్లు మరింత పెరిగేవేమో అంటున్నారు ట్రేడ్ నిపుణులు.
Read Also : Ram – Bhagya Sri: రామ్ తో ప్రేమ.. ఓపెనైన భాగ్య శ్రీ