Vijay Deverakonda Remembers Dil Raju Banner Rejected his Audition: విజయ్ దేవరకొండ హీరోగా ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా రూపొందిస్తూ ఉండగా ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. గతంలో గీత గోవిందం సినిమా డైరెక్ట్ చేసిన పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా కూడా రూపొందించారు. దిల్ రాజు బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒక ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ సందర్భంగా ఒక పాత విషయాన్ని బయటపెట్టారు. అదేమిటంటే గతంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఒక సినిమా ఆడిషన్ కోసం విజయ్ దేవరకొండ వెళ్లారట. అయితే అప్పటికి ఆయనకి ఎలాంటి గుర్తింపు లేదు ఆ సినిమా ఆడిషన్ లో విజయ్ దేవరకొండను సెలెక్ట్ చేయలేదట.
Vijay Deverakonda: ఇక కొత్త డైరెక్టర్స్‌తో అందుకే సినిమాలు చేయను!
ఈ విషయాన్ని ఒక జర్నలిస్టు గుర్తు చేస్తే విజయ్ దేవరకొండ ఆ విషయాన్ని గుర్తు చేసుకుని నిజమే నేను సినిమా ఆడిషన్ కి వెళ్తే దిల్ రాజు గారి బ్యానర్ లో నన్ను సెలెక్ట్ చేయలేదు, నేను చాలా హర్ట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. దానికి దిల్ రాజు కల్పించుకొని ఎప్పుడో కేరింత షూటింగ్ సమయంలో జరిగిన విషయం ఇది. విజయ్ దేవరకొండ ఆ సినిమా ఆడిషన్స్ కి వచ్చాడన్న సంగతి కూడా నాకు తెలియదు. ఆ సినిమా కోసమే వేరే ఆఫీస్ ఓపెన్ చేస్తే అక్కడ ఆడిషన్స్ తీసుకున్నారు. విజయ్ ఇలా ఆడిషన్స్ కి వచ్చాడు అన్న సంగతి పెళ్లిచూపులు సినిమా సక్సెస్ అయిన తర్వాత నాకు చెబితే అవునా అంటూ నవ్వేశాను అని చెప్పుకొచ్చారు. ఇక విజయ్ హర్ట్ అయ్యాడు కాబట్టే దాన్ని మనసులో పెట్టుకొని మరింత కసిగా పనిచేసే ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. ప్రతి ఒక్కరు ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడమే కాదు వాటిని మనసులో పెట్టుకొని మరింత కష్టపడితే ఉన్నత స్థాయికి వెళతారనడానికి విజయే నిదర్శనం అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు.