Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay – Rashmika: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం ఎంత ఘనంగా, సంప్రదాయబద్ధంగా జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ రాయల్ వెడ్డింగ్ వెనుక ఎవరికీ తెలియని ఓ అత్యంత సరదా ప్లాన్ ఉందన్న నిజాన్ని విజయ్ స్వయంగా బయటపెట్టారు. అసలు విజయ్ ఆలోచన ప్రకారం జరిగి ఉంటే.. పెళ్లిపీటలు కాకుండా సముద్రపు ఒడ్డున, పట్టువస్త్రాలు కాకుండా నిక్కరు (షార్ట్స్) వేసుకుని పెళ్లి చేసుకునేవారట! తాజా ఇంటర్వ్యూలో విజయ్ తన మనసులోని అసలైన వెడ్డింగ్ డ్రీమ్‌ను బయటపెట్టడంతో ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన పెళ్లి ఆలోచనల గురించి యాంకర్ సుమతో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ నవ్వులు పూయించారు. “నిజానికి నాలో రెండు వేర్వేరు పర్సనాలిటీలు ఉన్నాయి. మొదటి పర్సనాలిటీ ఏం చెబుతుందంటే.. ఎలాంటి ఆడంబరాలు వద్దు, ఏకంగా బీచ్ ఒడ్డున ఇసుకలో నిలబడి, షార్ట్స్ వేసుకుని చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుందాం అంటుంది. రెండో పర్సనాలిటీ మాత్రం.. పెళ్లి అంటూ చేసుకుంటే ఏకంగా కింగ్‌లా రాజసం ఉట్టిపడేలా గ్రాండ్‌గా చేసుకోవాలని కోరుకుంటుంది” అని విజయ్ చెప్పారు.
అయితే తన మనసులోని బీచ్ వెడ్డింగ్ ఆలోచనను అమలు చేయకపోవడానికి గల కారణాన్ని కూడా విజయ్ సరదాగా వివరించారు. “ఒకవేళ నేను నిజంగానే బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుంటానని చెబితే.. మా మమ్మీ నన్ను రెండు కొట్టి, ఓ పది రోజులు ఏడ్చి పెద్ద డ్రామా చేసేది. ‘నా పెద్ద కొడుకు పెళ్లిని ఇంత సింపుల్గానా చేసేది.. నేను ఎన్ని కలలు కన్నాను’ అంటూ ఇంట్లో గొడవ అయ్యేది. అందుకే నా ఫస్ట్ పర్సనాలిటీ ఆలోచనను వెంటనే పక్కన పెట్టేసి, కుటుంబ సభ్యుల ఆనందం కోసం, వాళ్ల ముఖాల్లో చిరునవ్వు చూడటం కోసమే సంప్రదాయబద్ధంగా కింగ్‌లా పెళ్లి చేసుకున్నాను” అని స్పష్టం చేశారు. మరోవైపు పెళ్లి ఏర్పాట్లు, నిర్ణయాల విషయంలో రష్మిక పూర్తిగా చేతులెత్తేసినట్లు విజయ్ సరదాగా చెప్పుకొచ్చారు. “రష్మిక ఎలాంటి తలనొప్పులు పెట్టుకోదు.. ‘నీకు ఏది కావాలో నువ్వు చేసుకో, నేను జస్ట్ ఫాలో అయిపోతా’ అంటూ పూర్తిగా సరెండర్ అయిపోయింది” అని నవ్వేశారు. ఆ మూడు రోజుల పెళ్లి వేడుకల్లో ఎలాంటి ఫోన్లు లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం కుటుంబం, సన్నిహితులతో కలిసి పిచ్చిగా ఎంజాయ్ చేశామని విజయ్-రష్మిక జోడీ మురిసిపోయారు. పెళ్లి తర్వాత ఈ రియల్ కపుల్ రణబాలి కోసం రీల్‌పై కనిపించబోతున్నారు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 16న రిలీజ్ కాబోతుంది.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!