Vijay Deverakonda Intresting Comments on Movie Production: నువ్విలా అనే సినిమాతో నటుడిగా మారి పెళ్లి చూపులు సినిమాతో హీరోగా లాంచ్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ స్టార్ గా తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకుని ఇప్పుడు ఖుషీ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఖుషి ట్రైలర్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ నిర్మాణం గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో విజయ్ కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. తనను హీరోని చేసి సినిమా చేసిన తరుణ్ భాస్కర్ హీరోగా మీకు మాత్రమే చెప్తా అనే సినిమాని విజయ నిర్మించాడు.
Mahesh Babu: అంతరిక్షంలో మహేష్ పేరుతో ఒక నక్షత్రం.. సూపర్ స్టార్ ఫ్యాన్సా..? మజాకానా.. ?
2019లో రిలీజ్ అయిన ఈ సినిమా వచ్చిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. అలా మొదటి డిజాస్టర్ మూటగట్టుకున్న విజయ్ రెండేళ్లు ఆగి తన తమ్ముడు హీరోగా పుష్పక విమానం అనే మరో సినిమా చేశాడు. ఆ సినిమా వచ్చిన సంగతి కూడా ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ నిర్మాణం జోలికి వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖుషి సినిమా ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ లో మీ నిర్మాణంలో సినిమాలు ఎప్పుడు వస్తాయని అడిగితే తాను ఆ ఒక్క దాని జోలికి వెళ్ళబోవడం లేదని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. సినిమాలు నిర్మించడానికి వీళ్ళున్నారు కదా అని తన పక్కనే కూర్చున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఎలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని ఇద్దరినీ చూపిస్తూ విజయ కామెంట్ చేశాడు. అంతేకాదు తాను ఓటీటీలో కూడా సినిమాలు చేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని తన సినిమాలు ఏదైనా థియేటర్లోనే ఆడాలని కోరుకుంటానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఇక రెండు సినిమాలకే విజయ్ దేవరకొండ కి నిర్మాణం అంటే భయం పుడుతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.