రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా సంప్రదాయ లుక్ లో కన్పించాడు. స్టైలిష్ ఫ్యాషన్ వేర్ లో ప్రైవేట్ జెట్ నుంచి బయటకు వస్తున్న పిక్ ను ఆయన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అనితా డోంగ్రే డిజైన్ చేసిన సాంప్రదాయ కుర్తా ధరించాడు. ఈ ఫోటోలను లో షేర్ చేస్తూ “విమానాలను పట్టుకోవడం. న్యాప్స్ పట్టుకోవడం” అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక విజయ్ దేవరకొండ విమానాశ్రయంలో కన్పించడాన్ని బట్టి, ఆయన తన తాజా చిత్రం షూటింగ్ ను ముగించుకుని వస్తున్నట్టు అన్పిస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న “లైగర్” షూటింగ్ పూర్తయ్యింది.
Read Also : లతాజీ అంత్యక్రియల్లో షారుఖ్ చేసిన పనిపై విమర్శలు… కానీ… !?
సహ నిర్మాత, నటి ఛార్మీ కౌర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో పూరీ జగన్నాథ్ ‘లైగర్’ షూటింగ్ పూర్తయ్యిందని, ఇక ‘జనగణమన’ స్టార్ట్ అని వెల్లడించారు. ‘లైగర్’ను హిందీ, తెలుగులో ఒకేసారి తెరకెక్కించారు. తమిళం, కన్నడ, మలయాళంలో డబ్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో పాపులర్ బాక్సర్ మైక్ టైసన్, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, అలీ, విషు రెడ్డి, మకరంద్ దేశ్‌పాండే, అబ్దుల్ క్వాదిర్ అమీన్ సహాయక పాత్రల్లో నటించిన ‘లైగర్’ ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.