Kingdom : విజయ్ దేవరకొండ ఆ మధ్య నెపోటిజంపై చేసిన కామెంట్స్ పెద్ద రచ్చ లేపాయి. అప్పుడెప్పుడో లైగర్ రిలీజ్ టైమ్ లో నా తాత ఎవరో తెలియదు.. మా అయ్య ఎవరో తెలియదు. అయినా నన్ను ఆదరిస్తున్నారు అంటూ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఆ మూవీ అట్టర్ ప్లాప్ అయిన తర్వాత దారుణంగా ట్రోల్ అయ్యాడు విజయ్ ఇప్పుడు కింగ్ డమ్ రిలీజ్ సందర్భంగా మొన్న ఇంగ్లిష్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజంపై కామెంట్స్ చేశాడు. వాటిపై నానా రచ్చ జరుగుతుండటంతో తాజా ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాడు. తాను నెపోటిజంపై చేసిన కామెంట్స్ తప్పుగా అనలేదన్నాడు.
Read Also : Kingdom : కింగ్ డమ్ కోసం విజయ్ షాకింగ్ రెమ్యునరేషన్..
ఇండస్ట్రీలో నెపోటిజం అనేది తప్పు కాదు. ఒక హీరో సినిమా చేయాలంటే వాళ్ల ఫాదర్ కథలు వింటారు, గైడెన్స్ ఇస్తారు. ఎలాంటి స్క్రిప్ట్ లు సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి టెక్నీషియన్స్ తో పనిచేయాలనేది చెప్తారు. అది ఒక అదృష్టం. నాకు ఆ అదృష్టం లేదు. నేను తప్పులు చేస్తూ సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నాకు అలా చెప్పడానికి ఎవరూ లేరు అనేది మాత్రమే నేను చెప్పాను. దాన్ని రకరకాలుగా ప్రచారం చేశారు అంటూ క్లారిటీ ఇచ్చుకున్నాడు విజయ్. కింగ్ డమ్ జులై 31న రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక మూవీపై మంచి అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కి మళ్లీ తానేంటో నిరూపించుకోవాలని విజయ్ ఆశపడుతున్నాడు.
Read Also : Kingdom : ఈ స్థాయికి వస్తా అనుకోలేదు.. విజయ్ ఎమోషనల్