రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మైక్ టైసన్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ 2022 ఆగస్ట్ 25న వెండితెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా నుంచి వరుస అప్డేట్స్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న ‘లైగర్’ బీటీఎస్ పిక్స్, అలాగే ఇన్స్టా ఫిల్టర్ విడుదల చేయగా… అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా రౌడీ బాయ్స్ అంతా ఎదురు చూస్తున్న “లైగర్” ఫస్ట్ గ్లింప్స్ రానే వచ్చేసింది.
53 సెకండ్ల పాటు సాగిన ఈ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండ బాక్సింగ్ రింగ్ లోకి పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. పూరీ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో రౌడీ బాయ్ పవర్ ఫుల్ డైలాగ్స్, దానికి తగ్గట్టుగా ఉన్న బాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై హైప్ ని పెంచేస్తోంది. విజయ్ దేవరకొండ ముంబైలోని చాయ్‌వాలా అని ఫస్ట్ గ్లింప్స్ వెల్లడించింది. బాక్సింగ్ రింగ్ లోపల విజయ్‌ని మునుపెన్నడూ లేని అవతార్‌లో చూపించారు. టీజర్‌ను విలక్షణమైన పూరి జగన్నాధ్ స్టైల్‌లో కట్ చేశారు. పోనీటైల్‌తో సరికొత్త లుక్ లో ఉన్నాడు. ముంబయి వీధుల్లో దూకుడుగా ఉండే ఒక చాయ్‌వాలా ఒక ఎంఎంఏ ఛాంపియన్‌గా ఎలా మారాడనేది ‘లైగర్’ సినిమా కథ.
Read Also : జక్కన్న ఏంటీ సైలెన్స్… ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు ప్రీ రిలీజ్ సంగతేంటి?
పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ. ఈ సినిమాను కన్నడ, తమిళ, మలయాళంలో కూడా డబ్ చేయనున్నారు. విజయ్, అనన్యతో పాటు ‘లైగర్’ రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్‌పాండే కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 25న ఈ పాన్ ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.