Vijay Devarakonda: యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కావాలి అన్నది అందరికి తెల్సిందే. గత కొన్నేళ్లుగా విజయ్ మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. గతేడాది ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. ఇక దీంతో విజయ్ ఆశలన్నీ ది ఫ్యామిలీస్టార్ సినిమాపైనే పెట్టుకున్నాడు. విజయ్ కెరీర్ లో గీతగోవిందం లాంటి హిట్ ను అందించిన పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అదే సినిమాను నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మాదాపూర్ లోని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐటీ ఆఫీస్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో విజయ్ తో పాటు కొన్ని కీలక పాత్రలు కూడా పాల్గొంటున్నాయని తెలుస్తోంది. సినిమ పైనే అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ మధ్య టీజర్ లో కూడా విజయ్ లుక్ ఆకట్టుకుంది. ఒక మిడిల్ క్లాస్ యువకుడిగా.. విజయ్ చాలా న్యాచురల్ గా కనిపించాడు. మరి ఈ సినిమాతోనైనా విజయ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.