Vijay Devarakonda: ఆకలి మీద ఉన్నా.. వేట మొదలుపెడుతున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు నడుస్తున్న విషయం విదితమే . ఇక ఇప్పటివరకు ప్రేక్షుకులు ఎంతగానో ఎదురుచూసిన సినిమాలన్నీ రిలీజ్ అయిపోయాయి. హిట్, ప్లాప్ పక్కన పెడితే ప్రేక్షకులు తమ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారో దర్శకులు వారిని అలా చూపించి మార్కులు కొట్టేశారు. ఇక పాన్ ఇండియా సినిమాల్లో అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా.. బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమా గురించిన కీలక అప్డేట్ ను విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ” భారతదేశం ముందు మమ్మల్ని మేము చూపించుకోవడానికే మా వంతు కోసం ఎదురుచూస్తున్నాం.. నేను ఆకలితో ఉన్నా.. భారతదేశం ఆకలితో ఉంది. ఇక ఇప్పుడు, అతన్ని చూపించే సమయం వచ్చింది.” అంటూ ఒక పోస్టర్ ను షేర్ చేశాడు. అయితే ఆ అప్డేట్ ను మే 9 న సాయంత్రం 4 గంటలకు చెప్తామని చెప్పుకొచ్చాడు. ఇక పోస్టర్ లో “వార్నింగ్.. అతడు వేట మొదలుపెట్టడానికి సిద్దమయ్యాడు” అని ఉండడంతో టీజర్ అనౌన్స్ మెంట్ ఇస్తారేమో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ వేట ఏంటి..? అనేది తెలియాలంటే మే 9 వరకు ఆగాల్సిందే.
Also Read
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
We have been waiting patiently for our turn in front of INDIA!
I am Hungrrrrry – India is Hungry
Now, Time has come to Unleash him.#Liger
May 9th – 4 PM pic.twitter.com/9Sqaa7Ezir— Vijay Deverakonda (@TheDeverakonda) May 4, 2022
తాజావార్తలు
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!