Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్టైల్, ఆ స్వాగ్ ఎప్పుడు అభిమానులను ఫిదా చేస్తూనే ఉంటాయి. ఇక రౌడీ హీరో డ్రెస్సింగ్ గురించి అయితే అస్సలు మాట్లాడుకొనవసరం లేదు. ఎప్పటికప్పుడు విజయ్ తన స్టైల్ ను మారుస్తూ కనిపిస్తూ ఉంటాడు. మొన్నటికి మొన్న బాలీవుడ్ ప్రెస్ మీట్ కు సాదాసీదా టీ షర్ట్, చెప్పులతో హాజరయ్యి షాక్ ఇచ్చిన ఈ హీరో తాజాగా సైమా వేడుకల్లో షార్ట్ తో కనిపించి షాక్ ఇచ్చాడు. వైట్ స్వెట్ టీ షర్ట్ పై బ్లాక్ కలర్ షార్ట్ తో పాటు బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని ఫుల్ స్వాగ్ లో కనిపించాడు. ఇక విజయ్ అలా చూసినవారందరు వ్వావ్ రౌడీ బాయ్ అంటూ ఫిదా అయిపోతున్నారు. అయితే సైమా వేడుకలకు ఈ హీరో ఇలా రావడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
ప్రతిష్టాత్మకమైన వేడుకలకు వచ్చేటప్పుడు ఇలానే వస్తారా..? ఇంకా విజయ్ యాటిట్యూడ్ మార్చుకోలేదని కొంతమంది చెప్పుకొస్తుండగా.. స్టేజి మీదకు వచ్చేటప్పుడు కాదు ఈ ఫొటోస్.. ఈ వేడుక ముందు విజయ్ అలా కనిపించదు. అందులో తప్పేముంది అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఇటీవలే విజయ్ నటించిన లైగర్ భారీ పరాజయాన్ని అందుకున్న విషయం విదితమే. హిట్లు, ప్లాపులు పట్టించుకోకుండా విజయ్ తన పంథాలో కొనసాగుతున్నట్లు ఈ ఫోటోలు చూస్తుంటేనే తెలుస్తోంది. ఇక ప్రస్తుతం విజయ్, శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇది కాకుండా పూరి తో జనగణమణ సెట్స్ మీదకు వెళ్లనుంది.