Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే లైగర్ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. ఖుషీ, జనగణమణ సెట్స్ మీద ఉన్నాయి. యాక్షన్ ఎంటర్ టైనెర్స్ మధ్యలో ఖుషీ అనే లవ్ స్టోరీతో రాబోతున్నాడు విజయ్.. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ పై పవన్ ఫ్యాన్స్ కొద్దిగా గుర్రుగా ఉన్న విషయం విదితమే. ఖుషీ అంటే పవన్ కెరీర్ లో ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టైటిల్ తో మరోసారి మ్యాజిక్ చేయడానికి విజయ్ దేవరకొండ రెడీ అయ్యాడు.
ఇక ఈ సినిమా టైటిల్ పై విజయ్ మొట్టమొదటిసారి ఓపెన్ అయ్యాడు. ” ఖుషీ టైటిల్ ను తీసుకోవడంతోనే నా బాధ్యత మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గర్వపడేలా ఈ సినిమా ఉంటోంది. పవన్ ఫ్యాన్స్ ను నిరాశపర్చను. ఆయన సినిమాలో ఉన్న మ్యాజిక్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది. ఖుషీ సినిమా ఆ జనరేషన్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో.. మా సినిమా ఈ జనరేషన్ లో కూడా అంతే మ్యాజిక్ సృష్టిస్తోంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా తేడా జరిగితే ఉంటుంది.. అప్పుడు చెప్తాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ ను అలరిస్తుందో లేదో చూడాలి.