Bichagadu 2: బిచ్చగాడి రేంజ్ మారింది… ట్రైలర్ విజువల్స్ అదిరిపోయాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2016లో రిలీజ్ అయిన బిచ్చగాడు సినిమా తెలుగు బయ్యర్ కి కాసుల వర్షం కురిపించింది. అమ్మ సెంటిమెంట్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో రిపీట్ మోడ్ లో బిచ్చగాడు సినిమాని చూశారు. ఈ మూవీ వచ్చిన ఏడేళ్లకి ఇప్పుడు బిచ్చగాడు 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. మే 19న బిచ్చగాడు 2 సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతూ మేకర్స్ బిచ్చగాడు 2 ట్రైలర్ ని రిలీజ్ చేశారు. గ్రాండ్ విజువల్స్, మంచి యాక్షన్స్ ఎపిసోడ్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్, రియలిస్టిక్ సెటప్ బిచ్చగాడు 2 ట్రైలర్ లో కనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని మరింత ఎలివేట్ చేసింది. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ పై సీన్స్ ని కూడా ట్రైలర్ లో చూపించారు. బిచ్చగాడు 2 అనే పేరు మాత్రమే ఉంచి మిగిలిన అన్ని విషయాల్లో స్టేక్స్ ని పెంచాడు విజయ్ అంటోని.
Read Also: Virupaksha: మొత్తానికి బౌండరీలు దాటుతున్నారు… ఈవారం కూడా విరుపాక్షదే
Also Read
తనే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కావడంతో బిచ్చగాడు 2 సినిమాని ఎలాంటి లోటు లేకుండా తెరకెక్కించినట్లు ఉన్నాడు. ఈ ట్రైలర్ లో మేజర్ డిజప్పాయింటింగ్ అంశం ఏదన్నా ఉంది అంటే అమ్మ సెంటిమెంట్ మాత్రమే. బిచ్చగాడు సినిమాకి ఆయువు పట్టు లాంటి అమ్మ సెంటిమెంట్, ఈ ట్రైలర్ లో కనిపించలేదు. ఈ విషయంలో ఆడియన్స్ కి సిస్టర్ సెంటిమెంట్ తో ఎమోషన్ ని పంచేలా ఉన్నాడు విజయ్ అంటోనీ. ఒక స్టార్ హీరో సినిమాకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న బిచ్చగాడు 2 ట్రైలర్, సినిమాపై అంచనాలని పెంచింది. మరి మదర్ సెంటిమెంట్ లేని ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఫేస్ చేస్తుందో చూడాలి.
பிச்சைக்காரன்2 – https://t.co/You39dqc6x
బిచ్చగాడు2 – https://t.co/BbM1dmSxKZBLOCKBUSTER 🟢 May19#Pichaikkaran2 #Bichagadu2 pic.twitter.com/ZoWlhXIC0O
— vijayantony (@vijayantony) April 29, 2023
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!