Vidya Vasula Aham : వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల విషయంలో కొంత క్లారిటీ వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ చిత్రం జనవరి 12న విడుదల కాబోతుండగా, ఆ మర్నాడే 13వ తేదీ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు సినిమాలతో పాటే తమిళ అనువాద చిత్రాలు విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తునివు’ కూడా పొంగల్ బరిలో నిలువబోతున్నాయి. విశేషం ఏమంటే… మాస్ అప్పీల్ ఉన్న ఈ నలుగురు హీరోలతో పాటు ఇద్దరు వారసులు కూడా సంక్రాంతి సీజన్ లో తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.
పాపులర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ ఇప్పటికే పలు చిత్రాలలో హీరోగా నటించారు. ఒకటి రెండు వెబ్ సీరిస్ లలోనూ చేశాడు. అలానే రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె శివానీ కొన్ని సినిమాలలో నటించింది. తాజాగా రాహుల్ విజయ్, శివానీ ‘విద్య వాసుల అహం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని అఫీషియల్ గా నిర్మాతలు బుధవారం ప్రకటించారు. పెళ్ళైన ఓ జంట మధ్య ఏర్పడి అహం వాళ్ళ జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పిందన్నదే ఈ సినిమా కథ! ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు కాన్సెప్ట్ వీడియో కూడా వ్యూవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ‘తెల్లవారితే గురువారం’ ఫేమ్ మణికాంత్ గెల్లి డైరెక్షన్ లో ‘విద్య వాసుల అహం’ చిత్రాన్ని లక్ష్మీ నవ్య మక్కపాటి, రంజిత్ కుమార్ కొడాలి నిర్మించారు. కళ్యాణీ మాలిక్ సంగీతాన్ని అందించారు. మరి పెద్ద సినిమాలతో పోటీ పడుతున్న ఈ యువ జంట ఏ మేరకు ప్రేక్షకులను తమ వైపు తిప్పుకుంటారో చూడాలి.
Let's get ready for the fun filled EGO clashes between Vi & Va this Sankranthi – 14th Jan, 2023.
సంక్రాంతికి అల్లుడే కాదు… కూతురు కూడా వస్తుంది! 🎉#VVAFilm 🎥#Vidyavasulaaham @gellimanikanth @Rshivani_1 @mdmoturu @kumar_kodali @LMakkapati @itsKalyaniMalik @venkateshrsr pic.twitter.com/ixzyESXcHX
— Rahul Vijay (@ActorRahulVijay) December 7, 2022