Venky 75 Years Celebrations: కలియుగ పాండవులు అనే సినిమాతో దగ్గుబాటి రామానాయుడు చిన్న కొడుకుగా దగ్గుబాటి వెంకటేష్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకోని.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత ఇప్పటివరకు 75 సినిమాల్లో నటించాడు వెంకటేష్. అయితే సినిమా, లేదా క్రికెట్.. వెంకీకి ఈ రెండే ప్రపంచం. ఇండస్ట్రీలో ఏ హీరోకు అయినా హేటర్స్ ఉంటారు. కానీ, ఇండస్ట్రీ మొత్తం వెతికినా వెంకీ మామకు హేటర్స్ ను తీసుకురాలేరు. ఆయన తీసిన సినిమాలు అలాంటివి. కుటుంబ కథా చిత్రాల, కామెడీ, బంధాలు, అనుబంధాలు ఇలా ప్రేక్షకులను మెప్పించే సినిమాలు తీస్తూ.. విక్టరీ వెంకటేష్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక సైంధవ్ సినిమా వెంకటేష్ 75 వ సినిమా. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి రానుంచి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని షురూ చేశారు మేకర్స్.
ఇక ఈ నేపథ్యంలోనే వెంకటేష్ 75చిత్రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా.. చిత్ర బృందం మొత్తం ఆయనకు సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. వెంకీ 75 సెలబ్రేషన్స్ పేరుతో ఒక పార్టీని కండక్ట్ చేస్తుంది. డిసెంబర్ 27 న JRC కన్వెన్షన్ లో ఈ వేడుక జరగనుంది. ఇక ఈ వేడుకలో కలియుగ పాండవులు నుంచి సైంధవ్ వరకు వెంకీ పనిచేసిన డైరెక్టర్స్, నటీనటులు కలవనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ వేడుకకు టాలీవుడ్ సీనియర్ హీరోలందరూ హాజరుకానున్నారట. టాలీవుడ్ అంటే.. చిరంజీవేయి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నాలుగు కుటుంబాలే టాలీవుడ్ ను ఏలుతున్నాయి. ఈ ఈవెంట్ లో ఈ నలుగురు ఒకే వేదికపై కలవనున్నారని తెలుస్తోంది. అదే కానీ నిజమైతే అభిమానులకు అంతకుమించిన ఆనందం ఉండదు అని చెప్పాలి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.