Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా గతేడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక బాలయ్య డబుల్ రోల్ లో కనిపించిన ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో హిట్ అందుకుంది. సాధారణంగా ఈ కాలంలో ఏ సినిమా కూడా నెలకు మించి థియేటర్ లో రన్ అవ్వడం లేదు. పెద్ద సినిమాలు అయినా.. హిట్ సినిమాలు అయినా కూడా నెలరోజులకు మించి థియేటర్ లో ఆడడం లేదు. కానీ, వీరసింహారెడ్డి మాత్రం కర్నూల్ లో 365 డేస్ థియేటర్ లో రన్ అయ్యి రికార్డ్ సృష్టించింది. ఏడాది మొత్తం.. నాలుగు షోస్ తో వీరసింహారెడ్డి రన్ అయ్యింది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా తెలిపారు.
ఇక 365 పోస్టర్ ను థమన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వీరసింహారెడ్డి ఫైర్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్టర్ చూసిన అభిమానులు బాలయ్య.. మజాకానా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ.. బాబీతో ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరి ఆ సినిమాతో బాలయ్య ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
#VeeraSimhaReddy 🔥 pic.twitter.com/aYEXXjEm4y
— thaman S (@MusicThaman) January 11, 2024