VarunTej 14th movie to be directed by Karuna Kumar: మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ముందు నుంచి తెలుగు హీరోలకు భిన్నంగా కంటెంట్ బేస్డ్ కథలను ఎంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన మరో కొత్త కథకు ఓకే చెప్పారని అది ఒక పీరియడ్ క్రైమ్ డ్రామా అని తెలుస్తోంది. ‘పలాస 1978’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన దర్శకుడు కరుణ కుమార్ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆయన ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ తీసినా ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవలేదు. మధ్యలో ఒక చిన్న సినిమా కేసుల తీసిన ఆయన ఇప్పుడు వరుణ్ తేజ్ కు ఒక కథ చెప్పగా అది ఆయనకు బాగా నచ్చిందని అంటున్నారు. విశాఖ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్ సినిమా ఉంటుందని అంటున్నారు. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో… 80, 90ల కాలంలో సాగే కథను కరుణ కుమార్ రెడీ చేశారని సినిమా స్క్రిప్ట్ కోసం ఆయన చాలా రీసెర్చ్ చేశారని అంటున్నారు.
Guntur Kaaram: సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్
ఇక ఈ సినిమాలో ఇప్పటి వరకు చేయని పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారని, క్యారెక్టర్ కోసం ఆయన మేకోవర్ కూడా కానున్నారని తెలుస్తోంది. ఇక వరుణ్ తేజ్, కరుణ కుమార్ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయనుందని అంటున్నారు. ప్రస్తుతం నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సంస్థ తమ రెండో సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించనుంది. ఇక ఈ నెల 27న లాంచ్ చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కాకుండా హిందీలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు వరుణ్ తేజ్.