Varun Tej: రిలీజ్‌కు ముందే వరుణ్ తేజ్ జాక్‌పాట్.. ‘కొరియన్ కనకరాజు’ రూ.26 కోట్ల బిజినెస్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఇండో-కొరియన్ హారర్ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ట్రేడ్ వర్గాల్లో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పటికే నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే సుమారు రూ.26 కోట్ల ఆదాయాన్ని రాబట్టినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.38 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రిలీజ్‌కు ముందే అదిరిపోయే బిజినెస్ జరగడం విశేషం.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకోవడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. హారర్, కామెడీ అంశాలతో రూపొందిన ఈ ఇండో-కొరియన్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా ప్రీమియం రేట్లకే జరుగుతున్నట్లు సమాచారం. పలు ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌కి మంచి డిమాండ్ కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద బ్రేక్ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాన్-థియేట్రికల్ రికవరీ, థియేట్రికల్ బిజినెస్‌కు వస్తున్న స్పందన, రిలీజ్‌కి ముందే ఏర్పడిన బజ్ వంటి అంశాలు ‘కొరియన్ కనకరాజు’కు పెద్ద ప్లస్‌గా మారాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం రిలీజ్ తర్వాత ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!