మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో చేస్తున్న సినిమా ‘గాంఢీవధారి అర్జున’. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జట్ తో, హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన మేకర్స్ ‘గాంఢీవధారి అర్జున’ టీజర్ ని రిలీజ్ చేసారు. ముందు నుంచి యాంటిసిపేట్ చేస్తున్నట్లు ‘గాంఢీవధారి అర్జున’ టీజర్ షార్ట్ అండ్ క్రిస్ప్ గా కట్ చేసారు. వన్ అండ్ హాఫ్ మినిట్ డ్యూరేషన్ తోనే టీజర్ ని కట్ చేసిన ప్రవీణ్ సత్తారు, ‘గాంఢీవధారి అర్జున’ కథ గురించి ఎలాంటి హింట్ ఇవ్వకుండా మేకింగ్ ని మాత్రమే చూపించే ప్రయత్నం చేసాడు. వరుణ్ తేజ్ ఒక స్పైగా, కిల్లింగ్ మెషిన్ గా పర్ఫెక్ట్ గా సరిపోయాడు. మెగా ప్రిన్స్ బాడీ లాంగ్వేజ్ కి, ఆ పర్సనాలిటీకి సరిపోయే క్యారెక్టర్ ని ప్రవీణ్ సత్తారు డిజైన్ చేసినట్లు ఉన్నాడు.
టీజర్ లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్, స్టంట్స్ బాగున్నాయి. స్పెషల్ గా టీజర్ లాస్ట్ 20 సెకండ్స్ ని బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ షాట్స్ తో కంప్లీట్ ప్యాక్ చేసిన విధానం అట్రాక్ట్ చేసింది. టీజర్ ని మెయిన్ హైలైట్ మిక్కీ జే మేయర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ప్రవీణ్ సత్తారు సీన్స్ ని మిక్కీ మరింత ఎలివేట్ చేసాడు. టీజర్ లో కనిపించిన ఒకే ఒక్క తెలిసిన ఫేస్ నాజర్ ది మాత్రమే. ఏజెంట్ సినిమాతో మంచి డెబ్యూ ఇస్తుంది అనుకున్న హీరోయిన్ సాక్షి వైద్య ‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో అయినా మొదటి హిట్ కొట్టి కెరీర్ నిలబెట్టుకుంటుందేమో చూడాలి. మరో నెల రోజుల్లో రిలీజ్ ఉన్న ‘గాంఢీవధారి అర్జున’ సినిమా వరుణ్ తేజ్ కి కూడా ఏ రేంజ్ హిట్ ఇస్తుందో చూడాలి.
Here is the teaser of #GandeevadhariArjuna
Hope you like it!💥
– https://t.co/evdVi7Wfig@PraveenSattaru @sakshivaidya99 @MickeyJMeyer @BvsnP @SVCCofficial @JungleeMusicSTH#GDAonAugust25th pic.twitter.com/Zp99yeeQzG
— Varun Tej Konidela (@IAmVarunTej) July 24, 2023