Bhediya: ‘తోడేలు’గా తెలుగువారి ముందుకొస్తున్న హిందీ హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Dhawan Bhediya Film Releasing As Thodelu In Telugu: ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ కొత్త సినిమా ‘బేడియా’ ట్రైలర్ వచ్చేసింది. సర్ ప్రైజింగ్ హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జానర్ మూవీగా ‘బేడియా’ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అమర్ కౌశిక్. ఈ సినిమా తెలుగు లో ‘తోడేలు’ పేరు తో రాబోతుంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దినేష్ విజాన్ నిర్మాత. హీరో వరుణ్ ధావన్ ఇండస్ట్రీలోకి వచ్చిన పదేళ్లవుతున్న సందర్భంగా ‘తోడేలు’ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 25న రిలీజ్ అవ్వనుంది.
అరుణాచల్ అడవుల నేపథ్యంగా ‘బేడియా’ కథ సాగుతుంది. ఇక్కడి వైల్డ్ యానిమల్ గాయపర్చిన తర్వాత కథానాయకుడు భాస్కర్ ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయి. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకునేందుకు అతని స్నేహితులు ప్రయత్నిస్తుంటారు. అతని వైల్డ్ బిహేవియర్ కు కారణాలేంటో తెలుసుకునే క్రమం అంతా ఆసక్తికర అంశాలతో సర్ ప్రైజింగ్ గా సాగుతుంది. ఈ కథను అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాకు ”టాప్ గన్ మెర్విక్, గాడ్జిలా వెర్సస్ కింగ్” వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు గ్రాఫిక్స్ డిజైన్ చేశాయి.
Also Read
- Allu Arjun Fans Association: కష్టాల్లో ఫ్యాన్ కుటుంబానికి అండగా AAFA.. రూ.1.5 లక్షల సహాయం!
- Ranveer Singh: హైకోర్టు ఆదేశాలతో..చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ క్షమాపణలు!
- Ravi Teja : ఆగస్ట్ రేస్‌లో మాస్ మహారాజా.. సాలిడ్ హిట్ కొడతాడా?
- Sunil: మంగళం శ్రీను పాత్ర వెనుక ఇంత కథ ఉందా..? సునీల్ షాకింగ్ రివీల్!
ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్మాత దినేష్ విజాన్ మాట్లాడుతూ… ”ఈ కథను ఫైనల్ చేసినప్పుడే ఇంత భారీ స్కేల్ లో నిర్మించాలని నిర్ణయించాం. దేశ విదేశాల్లో పేరున్న వీఎఫ్ఎక్స్ కంపెనీలు మా చిత్రానికి పనిచేశాయి. ఆ విజువల్ క్వాలిటీని ట్రైలర్ లో చూడొచ్చు. సకుటుంబ ప్రేక్షకులు థియేటర్ లో ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది” అన్నారు. దర్శకుడు అమర్ కౌశిక్ మాట్లాడుతూ, ”ట్రైలర్ లో చూపించిన సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ కొన్నే. థియేటర్ లో ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.కథా కథనాలు సర్ ప్రైజ్ చేస్తాయి. భయపెడుతూనే నవ్విస్తుంటాయి” అని చెప్పారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: మేము కాదు, వాళ్లే అసలు హీరోలు.. భువీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
Allu Arjun Fans Association: కష్టాల్లో ఫ్యాన్ కుటుంబానికి అండగా AAFA.. రూ.1.5 లక్షల సహాయం!
-
Story Board: ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!