Varanasi : ‘వారణాసి’ ట్రైలర్ బ్లాస్ట్..!
- అఫీషియల్ గా ‘వారణాసి’ టైటిల్
- 100 అడుగుల స్క్రీన్‌పై గ్రాండ్ ట్రైలర్
- రుద్ర గా మహేష్ బాబు లుక్ రివీల్
- టెక్నికల్ ఇష్యూలపై రాజమౌళి క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమ ఎదురుచూస్తున్న మహేష్ బాబు- రాజమౌళి భారీ ప్రాజెక్ట్‌కు అధికారికంగా పేరు ఖరారైంది. గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ ప్రారంభానికి కొద్దిసేపటికే స్క్రీన్లపై కనిపించిన పేరు.. ‘వారణాసి’. అనంతరం, ఈవెంట్లోనే ట్రైలర్‌ను రాజమౌళి గ్రాండ్‌గా విడుదల చేశారు. విజువల్‌గా అదిరిపోయే ఈ ట్రైలర్ అభిమానులకు పక్కా పండగలా మారింది.
ఈవెంట్లో ఏర్పాటు చేసిన భారీ 100 అడుగుల స్క్రీన్‌పై ట్రైలర్‌ను ప్రదర్శించారు. అందులో అంటార్కిటికా మంచు పర్వతాలు, ఆఫ్రికా అడవులు, లంకా నగరం, వారణాసి వంటి విభిన్న లొకేషన్లను దాటుకుంటూ మహేష్ బాబు ప్రయాణం చూపించారు. చివర్లో ఎద్దుపై త్రిశూలం పట్టుకుని రుద్ర అవతారంలో కనిపించిన మహేష్ ను చూసి అభిమానులు కేరింతలు వేశారు. ఆ వెంటనే టైటిల్ ‘వారణాసి’ డిస్ప్లే కావడంతో హాల్ మార్మోగిపోయింది.
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
ఇప్పటికే మేకర్స్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ప్రధాన విలన్ ‘కుంభ’గా, ప్రియాంక చోప్రాను హీరోయిన్ ‘మందాకిని’గా పరిచయం చేశారు. తాజగా మహేష్ బాబు పాత్రకు ‘రుద్ర’ అనే పేరు ఖరారైంది. ఈ చిత్రం 2027 సమ్మర్లో రిలీజ్ అవుతుందని అంతకుముందే కీరవాణి వెల్లడించారు.
“మేము కొత్తగా ఫిల్మ్డ్ ఫర్ IMAX టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దీనికి భారీ పవర్ అవసరం. నిన్న రాత్రి టెస్ట్ చేయాలని అనుకున్నాం కానీ కొందరు వచ్చి డ్రోన్ వీడియోలు తీసి నెట్లో పెట్టారు. లీక్ కాకూడదనే భయంతో డైరెక్ట్‌గా ఈరోజే స్క్రీనింగ్ పెట్టాం. పవర్ సరిపోక లేట్ అయింది. కొద్దిసేపు ఓపిక పట్టండి” అని రాజమౌళి చెప్పారు. తరువాత ట్రైలర్‌ను విజువల్ స్పెక్టకిల్‌గా ప్రదర్శించారు. ఆ తరువాత విడుదలచేసిన ట్రైలర్ మైమరిపించింది. ఈ సినిమాలో మహేష్ రాముడిగా కనిపించనున్నట్లు దర్శకధీరుడు క్లారిటీ ఇచ్చాడు. అయితే.. రామాయణంలో ఒక భాగం ఈ సినిమా అని ఆయన వివరించారు.
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..