ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణించాలి అంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో అవమానాలు భరించాలి.కెరీర్ మొదటిలో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నవారే స్టార్స్ గా ఇండస్ట్రీ లో ఒక స్థాయిలో వున్నారు.వారిలో హీరోలతో పాటు హీరోయిన్ లు కూడా వున్నారు. ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్స్ వారు స్టార్స్ గా ఎదగడానికి వారు ఎదురుకున్న అవమానాలను గురించి తెలిపిన విషయం తెలిసిందే.తాజాగా మరో హీరోయిన్ తన భాధను చెప్పుకుంది.వర్సటైల్ నటిగా తెలుగు మరియు తమిళ్ భాషల్లో పేరు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్. నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ. హీరోయిన్ గా పలు సినిమాల్లో కూడా నటించారు. ఆతర్వాత నటన స్థాయిని పెంచుకొని ఇప్పుడు స్టార్ యాక్టర్ గా మారింది.. హీరోయిన్ గానే కాదు లేడీ విలన్ గా తనదైన నటనతో అందరిని మెప్పిస్తుంది.
తెలుగులో మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో వరలక్ష్మీకి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో విలన్ గా నటించింది. రీసెంట్ గా బాలయ్య సినిమాలో కూడా తన నటనతో మెప్పించింది.వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించింది.. తాజాగా వరలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ మొదటిలో తాను ఎదురుకున్న అవమానాల గురించి తెలిపింది.ముఖ్యంగా తన గొంతు కొద్దిగా గంభీరంగా ఉండటంతో చాలా మంది వెక్కిరించారని ఆమె తెలిపింది.. హీరోయిన్ కు ఉండాల్సిన గొంతు ఇది కాదు నీ గొంతు మగాడి గొంతులా ఉంది అంటూ కామెంట్ చేసినట్లు ఆమె తెలిపింది.. అలా కామెంట్ చేసిన వారు నాకు డబ్బింగ్ చెప్పే ఛాన్స్ ఇవ్వలేదని వరలక్ష్మీ తెలిపారు.కానీ వాళ్ళ కామెంట్స్ ను పట్టించుకోకుండా ఇప్పుడు నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నా అని ఆమె తెలిపింది. నా అభిమానులు నా నటనతో పాటు నా గొంతును కూడా ప్రేమించారు అని ఆమె తెలిపింది.