కోలీవుడ్ తల అజిత్ కుమార్ నటించిన ‘వాలిమై’ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమిళ సినిమాలలో ఒకటి. హెచ్.వినోత్ రచన, దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ, హుమా ఖురేషి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ‘వాలిమై’ నిర్మాతలు ‘విజిల్ థీమ్ వీడియో’ని విడుదల చేసారు. ఈ సాంగ్ ను సంగీతం యువన్ శంకర్ రాజా స్వరపరిచారు. మేకర్స్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Read Also :
యాక్షన్తో కూడిన ఈ తమిళ చిత్రం టీజర్లు వైరల్గా మారాయి. ‘వాలిమై’ జనవరి 13న పొంగల్ స్పెషల్గా అన్ని చోట్లా విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు 160 కోట్లకు చేరుకుందని తెలిసింది. బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన ఈ డీల్ తో ఇప్పటికే 11 కోట్ల టేబుల్ ప్రాఫిట్ సంపాదించాడు. మరి ఈ సినిమా విడుదలై ఎంత వరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని కేరళలో ఈ4 ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేయబోతోంది.