‘వాలిమై’ ట్రైలర్: అజిత్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అజిత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ఎన్నో రోజులుగా ‘వాలిమై’ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసారు. ఇక తాజాగా ఆ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. హెచ్ వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ మరియు బోని కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ రిలీజ్ అయ్యి నెట్టింట రికార్డులు సృష్టించాయి. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపిస్తోంది.
“అర్జున్(అజిత్) ఒక పోలీసాఫీసర్.. చెన్నైలో జరిగే బైక్ దొంగతనాలు, వరుస హత్యల కేసును పై అధికారులు అతడికి అప్పగిస్తారు. వీటన్నింటిని చేస్తున్న విలన్ కార్తికేయను పట్టుకోవడానికి అర్జున్ రంగంలోకి దిగుతాడు. కానీ కార్తికేయా ఈ హత్యలన్నీ చేయించింది అర్జున్ అని నింద మోపి అతడిని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో అర్జున్ కుటుంబం, స్నేహితులు అందరు దూరమవుతారు. ఇక పోలీస్ యూనిఫార్మ్ వదిలిన అర్జున్.. కార్తికేయను ఎలా పట్టుకున్నాడు..? ఈ టామ్ అండ్ జెర్రీ గేమ్ లో ఎవరు గెలిచారు..? చివరికి కార్తికేయను అర్జున్ పట్టుకొని తిరిగి పోలీస్ గా జాయిన్ అయ్యాడా ..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ట్రైలర్ కట్స్ మాత్రం అదిరిపోయాయని చెప్పాలి. అజిత్ మరియు కార్తికేయ ల పెర్ఫార్మెన్స్ ఈ చిత్రం లో హైలెట్ గా మారాయి. అజిత్ సరసన బాలీవుడ్ భామ హైమా ఖురేషి నటిస్తోంది. ఇక యువన్ శంకర్ రాజా మ్యూజిక్ గుస్సా బంప్స్ తెప్పిస్తే.. విజువల్స్.. బైక్ రేసింగ్ యాక్షన్ సీన్స్ హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ అజిత్ ఫ్యాన్స్ పండగ చేసుకొనేలా ఉంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- PEDDI : కేవలం 4 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది
- Biggest Disaster : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్.. బడ్జెట్ రూ. 1400 కోట్లు.. కలెక్షన్స్ రూ. 6 కోట్లు
- Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!
తాజావార్తలు
-
Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
-
LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..
-
Parenting Tips : పిల్లల పెంపకంలో మీరు ఈ మాటలు వాడుతున్నారా.? అయితే జాగ్రత్త..!
-
Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
OnePlus Nord CE 6 Lite: వన్ప్లస్ నార్డ్ CE6 లైట్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర సేల్ డేట్ పూర్తి సమాచారం