అజిత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ఎన్నో రోజులుగా ‘వాలిమై’ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసారు. ఇక తాజాగా ఆ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. హెచ్ వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ మరియు బోని కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ రిలీజ్ అయ్యి నెట్టింట రికార్డులు సృష్టించాయి. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. హాలీవుడ్ యాక్షన్…
కోలీవుడ్ తల అజిత్ కుమార్ భారీ యాక్షన్ డ్రామా ‘వాలిమై’ ప్రకటించినప్పటి నుండి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా కోసం తమిళ అభిమానులతో పాటు ఇతర భాషల్లో ఉన్న అజిత్ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను తమిళంలో మాత్రమే విడుదల చేయాలనీ చిత్రబృందం అనుకుంది. కానీ అజిత్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు…
తల అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “వాలిమై”. ఈ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అజిత్ పవర్ ఫుల్ పోలీసు పాత్రను పోషిస్తున్నాడు. ఈ యాక్షన్ మూవీ సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా కోలీవుడ్ అంతా ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రీసెంట్ గా రష్యాలో జరిగిన ఫైనల్ షెడ్యూల్ లో ఈ సినిమాకు సంబంధించిన…
కోవిడ్ -19తో పోరాటానికి కోలీవుడ్ మొత్తం ఏకం అవుతోంది. తాజాగా తల అజిత్ తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షల భారీ విరాళం ఇచ్చారు. అజిత్ కుమార్ నేరుగా బ్యాంకు బదిలీ ద్వారా 25 లక్షలను సిఎం రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేశారు. ఇంకా సూపర్ స్టార్ రజినీకాంత్ రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇక ఇప్పటికే సూర్య, ఎఆర్ మురుగదాస్, ఉదయనిధితో సహా పలువురు తారలు కోవిడ్ సహాయక చర్యల…
తలా అజిత్ తన 50వ పుట్టినరోజును ఈరోజు తన కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున సహ నటులు, సాంకేతిక నిపుణులు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శివకార్తికేయన్, అనిరుధ్ రవిచందర్, హన్సిక, వేదిక, ఆదిలతో పాటు అనేక మంది ప్రముఖులు అజిత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శివకార్తికేయన్ అజిత్, దర్శకుడు శివలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసుకున్నారు. అందులో ఓ పిక్ లో అజిత్‌తో కలిసి ఉన్న యువ శివకార్తికేయన్…
(నేడు ‘తల’ అజిత్ పుట్టిన రోజు)హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ ఇవాళ తమిళనాడులో స్టార్ హీరో! రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో ఫాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్, విజయ్ నువ్వా- నేనా అన్నట్టుగా సాగుతున్నారు. మే 1 అజిత్ పుట్టిన రోజు. తమిళులు ‘తలా’ అని ప్రేమగా పిలుచుకునే అజిత్ కెరీర్ ప్రారంభంలోనే తెలుగు సినిమా ‘ప్రేమపుస్తకం’లో నటించడం విశేషం. అదీ గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో! ఈ సినిమా…
కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ కుమార్ అభిమానుల్లో జోష్ నింపే అప్డేట్ వచ్చింది. అజిత్ మరోసారి ‘వాలిమై’ దర్శకుడితో కలిసి పని చేయబోతున్నారు. డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 61వ చిత్రం రూపొందబోతోంది. ఇంతముందే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన నెర్కొండ పార్వై, వాలిమై చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అజిత్, వినోద్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ చిత్రమిది. దర్శకుడు హెచ్ వినోద్ కు అజిత్ తో కలిసి బ్యాక్…