Valari Trailer: పిండం లాంటి హర్రర్ చిత్రం తరువాత శ్రీరామ్ మరో హర్రర్ సినిమాలో నటిస్తున్నాడు. అదే వళరి. ఎం మృతిక సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీరామ్ సరసన రితికా సింగ్ నటించింది. కె సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మించిన ఈ చిత్రం ఈటీవీ విన్‌లో మార్చి 6వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిధిగా విచ్చేసి గ్రాండ్ గా రిలీజ్ చేశాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
“వెంకటాపురం బంగ్లా డీటెయిల్స్ కావాలి.. ఆ బంగ్లా గురించి మీకు తెలుసా?.. అది దెయ్యాల కొంప.. ఇలా మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ లో హారర్ ఎలిమెంట్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. రితికా సింగ్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేసింది. శ్రీరామ్ పాత్ర కూడా కీలకంగా వుంది. దర్శకురాలు మృతిక సంతోషిణి చాలా గ్రిప్పింగ్ నేరేషన్ తో ఈ సినిమాని రూపొందించారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. కెమరాపనితనం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. మరి ఈ సినిమాతో రితికా సింగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.