Vaishnavi Chaithanya : బేబీ మూవీతో భారీ క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య చాలా రోజుల తర్వాత జాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సిద్ధు జొన్నలగడ్డ సరసన ఆమె ఇందులో నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కాబోతోంది. అయితే వైష్ణవి తాజాగా చేసిన పనితో అంతా షాక్ అవుతున్నారు. స్టేజి మీదనే ఆమె పరువు పోయిందిగా అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మూవీ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కావాల్సి ఉండటంతో ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని భీమవరం, రాజమండ్రి ప్రాంతాలకు ఈ రోజు మూవీ టీమ్ వెళ్లింది.
Read Also : Odela-2 : ఓదెల-2 ట్రైలర్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎక్కడ..?
అయితే భీమవరం ఈవెంట్ కు వచ్చిన వైష్ణవి మాట్లాడుతూ.. మీ రాజమండ్రికి వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పింది. దీంతో అక్కడకు వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు అరవడంతో వెంటనే హీరో సిద్ధు అలెర్ట్ అయ్యాడు. ఇది భీమవరం అంటూ వైష్ణవికి చెప్పడంతో.. ఆమె నాలుక కరుచుకుంటూ.. ‘ఓ ఫ..’ అంటూ ఓ బూతు పదం కూడా అనేసింది. దీంతో అంతా షాక్ అయ్యారు. తాను రాజమండ్రికి వెళ్లి ఇక్కడకు రావడంతో పొరపడ్డానంటూ ఆమె కవర్ చేసింది. అయినా అప్పటికే జరగాల్సింది అంతా జరిగిపోయింది. అక్కడకు వచ్చిన వాళ్ల అరుపులతో వైష్ణవి ఫేస్ మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.