Odela-2 : మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల-2. పోస్టర్లు, టీజర్లతోనే ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించింది ఈ సినిమా. మొదటి పార్టును మించి రెండో పార్టు ఉంటుందనే హైప్ రావడంతో మూవీ ట్రైలర్ కోసం తమన్నా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ట్రైలర్ గురించి అప్ డేట్ ఇచ్చింది మూవీ టీమ్. ఓదెల-2 ట్రైలర్ ను ఏప్రిల్ 8వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తామని తెలిపారు. ముంబై వెస్ట్ బాంద్రాలోని గెలాక్సీ థియేటర్ లో ఈ ట్రైలర్ లాంచ్ వేడుక ఉంటుందని తెలిపింది మూవీ టీమ్. తమన్నాతో పాటు మూవీ టీమ్ ఈ వేడుకకు హాజరు అవుతారని అధికారికంగా ప్రకటించారు.
Read Also : Peddi : రామ్ చరణ్ వర్సెస్ నాని.. ‘పెద్ది’కి పోటీగా మూడు సినిమాలు..!
అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తమన్నా మెయిన్ లీడ్ రోల్ చేస్తోంది. హెబ్బా పటేల్, వశిష్ట సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. మొదటి పార్టు హిట్ కావడంతో రెండో పార్టుపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాను ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ టీజర్ ను ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఐదు భాషల్లో మూవీని ప్రమోట్ చేస్తోంది టీమ్. తెలుగు కంటే నార్త్ లోనే వేడుకలు ఎక్కువగా నిర్వహించి అక్కడ బజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. తమన్నాకు నేషనల్ వైడ్ గా క్రేజ్ ఉంది కాబట్టి అది సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నారు. మరి మూవీ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.