వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గిరీషయ్య ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లవ్, ఇగో ప్రధాన అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ఈ టీజర్ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తోంది. ‘నన్నే చూస్తావ్.. నా గురించే కలలు కంటావ్.. కానీ నీకు నాతో మాట్లాడటానికి ఇగో’ అని హీరోతో హీరోయిన్ చెప్పే డైలాగ్ ఈ మూవీ కథ ఏంటో చెప్పేస్తోంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు ఇద్దరూ మాట్లాడుకోరు.. కానీ ప్రేమించుకుంటారు. ఒకరినొకరు అమితంగా ఇష్టపడుతున్నట్లు టీజర్లో చూపించారు. ‘ఇలా చెప్పిన మాట విన్నప్పుడు భలే ముద్దొస్తావురా’ అంటూ టీజర్ చివర్లో హీరోయిన్ చెప్పే డైలాగ్.. అప్పుడు వైష్ణవ్ తేజ్ లుక్స్ యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి.
ఈ మూవీలో రిషి పాత్రలో వైష్ణవ్ తేజ్, రాధ పాత్రలో కేతికా శర్మ నటిస్తున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నా యి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్, పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి ఉప్పెన, కొండ పొలం లాంటి సినిమాలతో అలరించిన వైష్ణవ్ తేజ్ కెరీర్లో ‘రంగ రంగ వైభవంగా’ మూడో సినిమాగా తెరకెక్కుతోంది.