Vaishnav Tej: ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎవరు చెప్పలేరు. అసలు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి విషయం.. వాళ్ళు ఎంగేజ్ మెంట్ పిక్స్ పోస్ట్ చేసేవరకు ఎవరు నమ్మలేదు అంటే అతిశయోక్తి కాదు. దాదాపు ఐదేళ్లుగా ఈ జంట రిలేషన్ లో ఉన్నారు. ఎప్పుడు వీరి రిలేషన్ గురించి అడిగినా వరుణ్ సైలెంట్.. లావణ్య అయితే అసలు ఏం తెలియనట్లే చెప్పుకొచ్చేది. ఏదిఏమైనా ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక వీరి పెళ్లి ఇటలీలో చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఈ జంట ప్రైవేట్ పార్టీస్ లో ఒక్క హీరోయిన్ మాత్రం తరుచుగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె రీతూ వర్మ. ఈ అచ్చ తెలుగు ముద్దుగుమ్మ నిహారిక పెళ్లి నుంచి.. ప్రతి మెగా పార్టీలో కూడా పాల్గొంటూ వస్తుంది.
Ram Charan: మంగళవారం కు మరింత బూస్ట్ తెచ్చిన చరణ్..
వరుణ్ లావణ్య ప్రైవేట్ పార్టీలో ఈ చిన్నది మాత్రమే స్పెషల్ గా కనిపించేసరికి.. వేరే అనుమానాలు మొదలయ్యాయి. లావణ్య కూడా నిహారిక పెళ్ళిలో సందడి చేసింది. అప్పటికే ఇంట్లో వరుణ్- లావణ్య ప్రేమ గురించి తెలిసి ఉంటుంది. అలాగే రీతూ కూడా .. మెగా హీరోల్లో ఎవరితోనైనా రిలేషన్ లో ఉందేమో అనే అనుమానాలు రేకెత్తాయి. ఇక మెగా హీరోల్లో పెళ్లి కాకుండా ఉన్నది.. పంజా బ్రదర్స్ సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్. ముఖ్యంగా వైష్ణవ్, రీతూ రిలేషన్ లో ఉన్నారు అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక తాజాగా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు వైష్ణవ్ తేజ్. ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న వైష్ణవ్ కు ఈ ప్రశ్ననే ఎదురయ్యింది. “మీ ప్రైవేట్ పార్టీస్ లో రీతూ వర్మ ఉండడానికి కారణం” అన్న ప్రశ్నకు వైష్ణవ్ సమాధానమిస్తూ.. ” ఆమె.. లావణ్య ఫ్రెండ్, అందుకే పార్టీస్ కే వస్తుంది. లావణ్య పిలవడం వలనే రీతూ వచ్చింది. అంతకుమించి వేరే ఏం లేదు” అని చెప్పాడు. దీంతో ఈ పుకార్లకు చెక్ పడినట్లు అయ్యింది. మరి వైష్ణవ్.. ఆదికేశవ్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.