పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏపీలో పొలిటికల్ హీట్ పెరగడంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా టీడీపీతో పొత్తు అనౌన్స్ చేసి అగ్రెసివ్ గా క్యాంపైన్స్ చేస్తున్నాడు. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. పొలిటికల్ ప్లాన్స్ వేస్తూనే సినిమా పనులు కూడా చేస్తున్న పవన్ కళ్యాణ్… ఉస్తాద్ భగత్ సినిమా షూటింగ్ కి మళ్లీ డేట్స్ కేటాయించాడు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ దాదాపు 50% షూటింగ్ కంప్లీట్ అయ్యిందట. ఇన్ని రోజులు షెడ్యూల్ బ్రేక్ లో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు నుంచి అయిదు రోజుల పాటు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చాడట.
పవన్ కళ్యాణ్ పైన మెయిన్ సీన్స్ కి హరీష్ శంకర్ ఈ అయిదు రోజులు షూట్ చేయనున్నాడు. ప్రతి షెడ్యూల్ స్టార్ట్ అవ్వగానే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక ఫోటోని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాడు హరీష్ శంకర్. గ్లిమ్ప్స్ తో అంచనాలు పెంచిన హరీష్ శంకర్, మరోసారి గబ్బర్ సింగ్ లాంటి హిట్ ని ఇస్తాడని నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. పైగా ఉస్తాద్ భగత్ సింగ్ పొలిటికల్ సీజన్ ని టార్గెట్ చేస్తుంది కాబట్టి ఇది వచ్చే ఎన్నికలకి కూడా హెల్ప్ అయ్యేలా ఉండే అవకాశం ఉంది. మరి అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పాల్గొంటాడు కాబట్టి అప్పటివరకూ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ చెయ్యొచ్చు. ఫ్యాన్ స్టఫ్ ఇవ్వడంలో దిట్ట అయిన హరీష్ శంకర్… ఉస్తాద్ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు? ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి.