Ustaad Bhagat Singh Shoot Second Schedule Completed: పవన్ కళ్యాణ్ హీరోగా ఇంతకు ముందు హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ తీయగా అది అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయింది. పదేళ్ళ విరామం తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ ఇంటర్వెల్ సీన్ జనవరి 17, 2012లో షూటింగ్ చూస్తే… సెప్టెంబర్ 27, 2023లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంటర్వెల్ తీసినట్లు ఈమధ్యనే ప్రకటించిన హరీష్ శంకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాల్గొనగా… ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి చేశామని కూడా చెప్పుకొచ్చారు. ఇందులో పవన్ పెర్ఫార్మన్స్ మామూలుగా లేదని సినిమాపై అంచనాలు పెంచేలా ఆయన ట్వీట్ ఉంది. శనివారం (సెప్టెంబర్ 30) ఉదయం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సన్నివేశాల షూట్ ను సినిమా యూనిట్ పూర్తి చేసింది. ఇక తాజా షెడ్యూల్‌లో, హైదరాబాద్‌లో ఒక దేవాలయం నేపథ్యంలో పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించారు.
Bhakta Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’ కోసం మరో స్టార్ హీరో?
పవన్ కళ్యాణ్ ఇప్పటికే 14 రోజుల షూట్ లో పాల్గొన్నారు. మొదటి షెడ్యూల్ – 8 రోజులు రెండవ షెడ్యూల్ – 6 రోజులు ఆయన షూట్ లో పాల్గొన్నారు. శ్రీలీల కథానాయికగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా 2024లో విడుదల కానుంది. ఇక మరోపక్క అక్టోబర్ మొదటి తేదీ నుండి, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర ప్రారంభించడానికి పవన్ విజయవాడకు బయలుదేరుతారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కాకుండా సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మించే సినిమా కూడా చేయాల్సి ఉంది కానీ అది ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది అనేదానిపై క్లారిటీ లేదు.