Mohan Lal Roped in for Manchu Vishnu’s Bhakta Kannappa: వరుస పరాజయాలను అందుకుంటూ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గని మంచు విష్ణు ఈ మధ్యనే ఓ ప్రతిష్టాత్మక సినిమా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా రేంజిలో రూపొందుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దిగవంగత నటుడు కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని రీమేక్ చేస్తూ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పనులు కూడా మొదలయ్యాయి. ఆ మధ్య శ్రీ కాళహస్తిలో సినిమా యూనిట్ పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ మహా శివుడి పాత్రలో నటిస్తుండగా ఆయన సరసన పార్వతి పాత్రలో నయనతార నటిస్తుందని ప్రచారం కూడా జరుగుతోంది.
Tollywood Releases: ఈవారం బాక్స్ ఆఫీస్ బరిలో అరడజను తెలుగు సినిమాలు
ఇక రానున్న రోజుల్లో ఈ సినిమాలో మరింత మంది స్టార్ క్యాస్ట్ జాయిన్ అవ్వబోతున్నారు అనే ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మోహన్ లాల్ సినిమాలో భాగమైనట్టు చెబుతున్నారు. ఇక ఈమేరకు అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మంచు విష్ణు ఓ వీడియో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి నిమా కోసం ఉపయోగించే సెట్ ప్రాపర్టీస్ తయారీని చూపించారు. మొత్తం 800 మంది సెట్ తయారీ బృందం 5 నెలలు కష్టపడి ఈ ఆర్ట్ వర్క్ పూర్తి చేశారని 8 కంటెయినర్లు సరిపడా సెట్ ప్రాపర్టీని న్యూజిలాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం అక్కడే పూర్తి చేయనున్నట్లు మంచు విష్ణు ముందే ప్రకతింహ్చారు. మోహన్ బాబు నిర్మించబోతున్న ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. విష్ణుకి జోడిగా బాలీవుడ్ నటి నుపుర్ సనన్ ఫిక్స్ అయినా, కొన్ని కారణాలతో ఆమె తప్పుకోవడంతో మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడింది సినిమా యూనిట్.