టాలీవుడ్‌లో సినిమా అప్‌డేట్‌లు సాధారణంగా దర్శకులు లేదా నిర్మాతల ద్వారా బయటకు వస్తాయి. కానీ ఈ మధ్య కాలంలో హీరోయిన్లు మాత్రం సోషల్ మీడియాలో ముందుండి అప్డేట్స్ ఇచ్చేస్తూ అభిమానుల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా నటి రాశీఖన్నా కూడా అలాంటి అప్డేట్‌తో చర్చలోకి వచ్చారు. రాశీఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన తాజా ఫొటో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Also Read : Shah Rukh khan : షారుక్ – సుహానా కి వరుసగా లీగల్ ట్రబుల్స్.. !
ఆమె పవర్ స్టార్ పవన్ తో సెల్ఫి దిగి పెట్టింది. ఇది ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ లొకేషన్‌లో తీసిన సెల్ఫీ. రాశీఖన్నా ఆనందంగా నవ్వుతుండగా, పవన్ సాధారణంగా కనిపించగా, వెనుక చిత్రబృందం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోకు రాశీఖన్నా జత చేసిన క్యాప్షన్ మాత్రం అభిమానుల హృదయాలను తాకింది –“ఈ క్షణాలను నా జీవితకాల జ్ఞాపకంగా గుర్తుంచుకుంటా” అని ఆమె రాసింది. దీంతో ఈ ఫొటోపై అభిమానులు, నెటిజన్లు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ బారీ హైప్ ఉండగా, రాశీఖన్నా పోస్ట్ ఆ వార్తలకు మరింత బలాన్నిచ్చేలా మారింది. కొందరు అయితే పవన్ ఇప్పటికే తన భాగం పూర్తిచేశారని కూడా ఈ ఫొటో ఆధారంగా రాసేస్తున్నారు. రాశీఖన్నా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గౌరవంగా మాట్లాడారు. ఆయనతో కలిసి నటించే అవకాశం దక్కడం తనకు గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఈ ఫొటో ఆ మాటలకు మరింత బలం చేకూర్చింది. మొత్తానికి రాశీఖన్నా షేర్ చేసిన ఒకే ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు అయితే ఈ కాంబినేషన్‌పై మరింత ఎగ్జైటెడ్ అవుతున్నారు.