పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన ఓజి చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమాకి తర్వాత పవన్ నుంచి రాబోతున్న మరొక మాస్ ఎంటర్‌టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ పవన్ ఎనర్జీని రెట్టింపు చేశాయి. ఇక తాజాగా లభించిన సమాచారం ప్రకారం, ఈ దీపావళి సందర్భంగా మేకర్స్ పెద్ద అప్డేట్ ఇవ్వనున్నారు. అదేంటంటే, సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
Also Read : Kantara : “కాంతార చాప్టర్ 1 చూసి ఇండియన్ డైరెక్టర్లంతా సిగ్గుపడాలి” – ఆర్జీవీ
ఈ సినిమాలో శ్రీ లీల, రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది పవన్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.