Kantara : “కాంతార చాప్టర్ 1 చూసి ఇండియన్ డైరెక్టర్లంతా సిగ్గుపడాలి” – ఆర్జీవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కాంతార చాప్టర్ 1’ సినిమా విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు, భారీ వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ ప్రీక్వెల్‌పై ఇప్పటికే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా, యష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు స్పందించి ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో రివ్యూ ఇచ్చి రిషబ్ శెట్టి పై ప్రశంసల వర్షం కురిపించాడు.
Also Read : Laya : లయ ఫస్ట్ లుక్.. ‘నా కుటుంబం జోలికి వస్తే!’
Also Read
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
అక్టోబర్ 3న ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆర్జీవీ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “కాంతార ఛాప్టర్ 1 అద్భుతం. రిషబ్ శెట్టి, అతని టీమ్ బీజీఎం, సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, వీఎఫ్ఎక్స్‌లో చూపిన అద్భుతమైన ప్రయత్నం చూసిన తర్వాత.. భారత దేశంలో దర్శకులందరూ సిగ్గుపడాలి. కంటెంట్ ఒక బోనస్ మాత్రమే. కేవలం వారి కష్టానికి ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడానికి అర్హత ఉంది. హోంబలే ఫిల్మ్స్ క్రియేటివ్ టీమ్‌కు ఇచ్చిన స్వేచ్ఛకు హ్యాట్సాఫ్. రిషబ్ శెట్టి, మీరు గొప్ప దర్శకులా లేక గొప్ప నటులా అనే విషయంలో నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను” అని వర్మ పేర్కొన్నాడు. తన పనికి లభించిన ఈ ప్రశంసలకు రిషబ్ శెట్టి వినయంగా స్పందించాడు. “నేను కేవలం సినిమా లవర్ మాత్రమే సార్. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అని ఆర్జీవీకి రిప్లై ఇచ్చాడు. ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ సహా పలు భాషల్లో విడుదలైంది. 2022 లో వచ్చిన ‘కాంతార’ కథకు వెయ్యి సంవత్సరాల ముందు రోజుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు.
KANTAAAARRRAAA is FANTAAAASTICCCC .. All FILM MAKERS in INDIA should feel ASHAMED after seeing the UNIMAGINABLE EFFORT @Shetty_Rishab and his team put in the BGM, SOUND DESIGN, CINEMATOGRAPHY , PRODUCTION DESIGN and VFX ..Forgetting the CONTENT which is a BONUS , their EFFORT…
— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2025
తాజావార్తలు
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!