ఇజ్రాయెల్ లో జరగననున్న మిస్ యూనివర్స్ 2021 పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించబోతోంది బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ ఊర్వశి రౌతేలా. ఇండియా నుంచి ఈ ఈవెంట్ కు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన వారిలో అతి చిన్న వయస్కురాలు ఈ బ్యూటీ కావడం విశేషం. 2021 డిసెంబర్ 12న ఇజ్రాయెల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక మిస్ ఇండియా పోటీల కోసం తాజాగా ఇజ్రాయెల్ చేరుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన ఇంటికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఊర్వశి ఆయన నివాసంలో బెంజమిన్ తో పాటు ఆయన కుటుంబాన్ని కూడా కలిసి బహుమతిగా భగవద్గీతను అందించారు. అంతేకాదు మాజీ ప్రధానికి ‘సబ్ షాందర్ సబ్ బదియా’ అనే కొన్ని హిందీ పదాలను కూడా నేర్పింది.
Read also : హనీమూన్ కోసం కత్రినా, విక్కీ లాంగ్ ట్రిప్… ఇదీ ప్లాన్
ఈ వీడియోను ఊర్వశి తన ఇన్స్టా లో పోస్ట్ చేస్తూ “ఇజ్రాయెల్ మాజీ ప్రధాని, ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రధానమంత్రి, తెలివైన బెంజమిన్ నెతన్యాహు కూడా తనను మిస్ యూనివర్స్ ఈవెంట్కు ఆహ్వానించారు” అంతో ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఊర్వశి రౌతేలా ‘ఇన్స్పెక్టర్ అవినాష్’ చిత్రంలో ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా నిజ జీవిత భార్య పూనమ్ మిశ్రాగా కనిపించనుంది. ఆమె తెలుగులో “బ్లాక్ రోజ్”తో సహా మరికొన్ని దక్షిణ భారతీయ చిత్రాలలో కూడా కనిపిస్తుంది.