Urvashi Rautela : బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలాకు పాన్ ఇండియా మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. సినిమాల్లో హీరోయిన్ గా కంటే కూడా ఐటెం సాంగ్స్ తోనే బాగా ఫేమస్ అయింది. టాలీవుడ్ లో చాలా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ ఇక్కడ కూడా క్రేజ్ సంపాదించుకుంది. మొన్న బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి మంచి గుర్తింపు పొందింది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్లు చేసింది. ‘నేను ఎప్పుడూ నా పని గురించే ఆలోచిస్తుంటాను. నేను చేసే సినిమాలకు మంచి ప్రమోషన్లు చేయడం కోసం ఏమైనా చేస్తాను. ఈ విషయంలో మీరు అందరూ నన్ను పొగడాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ తర్వాత సినిమాల ప్రమోషన్లు చేసేది నేనే. ఆ విషయంలో అందరూ నన్ను గుర్తించాలి’ అంటూ సెల్ఫ్ గోల్ చేసుకుంది.
Read Also : Kalyan Ram: భాద్యతగా ఉండండి… నేర్చుకోండి!
‘నేను సినిమాల కోసం చాలా ప్రమోషన్ ఈవెంట్లు చేస్తాను. నేను గతంలో చేసిన సినిమాలను చూస్తే మీకే తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో నన్ను ప్రమోషన్ చేయమని అడుగుతున్నారు. కానీ నేను చేయనని చెప్పాను. నేను చేస్తున్న సినిమాలకు ప్రమోషన్లు చేయడంలో బిజీగా ఉంటాను. నేను చేసే సినిమాల పట్ల బాధ్యతతో ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంపై నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. ఈ మాత్రం దానికి ఏదో గొప్ప చెప్పుకోవడం ఏంటి అంటున్నారు. సినిమాలో యాక్ట్ చేసినప్పుడు దాని ప్రమోషన్ చేయడం కూడా పెద్ద గొప్ప పనా అంటున్నారు.