ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త ఫ్యాషన్ ను కనిపెట్టడంలో అమ్మడి తర్వాతే ఎవరైనా.. వెరైటీ, వెరైటీ డ్రెస్ లతో కుర్రకారును తన అందాలతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అయితే అమ్మడి ఫ్యాషన్ ను కొంతమంది ఆస్వాదిస్తారు.. మరికొంతమంది ఈ పిచ్చి ఫ్యాషన్ ఏంటి అంటూ విమర్శిస్తుంటారు. అయితే ఒక లిమిట్ వరకు ఒకే కానీ.. ఉర్ఫీ లిమిట్ దాటింది అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిన్నీసులతో, రబ్బర్ బ్యాండ్ లతో, చిన్న చిన్న బట్టలతో డ్రెస్ లు కుర్త్తి దాన్ని ఫ్యాషన్ గా చెప్పుకు తిరుగుతుంది.. అంతకంటే బట్టలు లేకుండా తిరగడం నయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మొన్నటికి మొన్న ఒక దోమ తెరలాంటి డ్రెస్ ను వేసుకొని కనిపించింది ఈ భామ.. ఆ దోమ తెర డ్రెస్ లో అమ్మడి ఇన్నర్ అందాలన్నీ ఆరబోసింది. ట్రాన్సఫరెంట్ గా కనిపిస్తున్న ఆ డ్రెస్ లో అమ్మడి అందాల ఆరబోత చాలామందికి నచ్చలేదు. దీంతో ఆ డ్రెస్ పై ట్రోలింగ్ చేశారు. దోమల జాలి కంటే పలుచని డ్రెస్ వేసుకున్న ఉర్ఫీ స్టైల్ దరిద్రంగా ఉందని కామెంట్స్ పెట్టుకొచ్చారు.
ఇక దీనిపై ముద్దుగుమ్మ స్పందించింది. అది కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తో పోల్చుకొని మరీ తనను తాను సమర్ధించుకోవడం విశేషం. సమంత ట్రాన్సఫరెంట్ డ్రెస్ లో హాట్ గా ఉంది అన్న వార్తను, అలాంటి డ్రెస్ లో ఉర్ఫీ దరిద్రంగా ఉంది అన్న వార్తను పక్క పక్కన పెట్టి నెటిజన్స్ కు గట్టి ప్రశ్న వేసింది. సమంత ఇలాంటి డ్రెస్ వేసుకొనే సూపర్, హాట్ అని పొగిడి, నేను అలాంటి డ్రెస్ వేసుకొంటే తప్పు, దరిద్రం అని తిడుతున్నారు ఎందుకు..? ఆమెలా పలుచటి డ్రెస్ నేను వేసుకుంటే తప్పా..?, సమంత అంటే నాకూ ఇష్టమే, నేను కేవలం పైన రాసి ఉన్న హెడ్‌లైన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీంతో నెటిజన్స్.. ఆమె అప్పుడప్పుడు ఇలాంటి ఫోటో షూట్స్ చేస్తోంది.. కానీ నువ్వు అదే పనిగా పెట్టుకొని చేస్తున్నావ్.. ఇద్దరికీ తేడా లేదా..?అంటూ కామెంట్స్ పెడుతున్నారు.