కిచ్చా సుదీప్ కి సౌత్ అండ్ నార్త్ లో మంచి గుర్తింపు ఉంది. విలక్షణ నటుడు ఉపేంద్రకి సౌత్ లోని అన్ని ఇండస్ట్రీల్లో ఒక మోస్తరు మార్కెట్ కూడా ఉంది. ఇక శివ రాజ్ కుమార్ కి అయితే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హోదా ఉంది. ఇలాంటి ముగ్గురు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అని ఆ సినిమా పోస్టర్ బయటకి వస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ అవుతుందో అని ట్రేడ్ వర్గాలంతా ఆకాశాన్ని తాకే రేంజులో లెక్కలు వేసుకుంటూ ఉంటారు. కబ్జా సినిమా అలాంటి అంచనాలతోనే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యింది. సాలిడ్ ప్రమోషన్స్ జరుపుకున్న కబ్జా మూవీ మార్చ్ 17న థియేటర్స్ లోకి వచ్చింది. మొదటి రోజు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్, నెగటివ్ టాక్, KGF కాపీ అనే టాక్ స్ప్రెడ్ అవ్వడంతో శివన్న, ఉపేంద్ర, సుదీప్ లాంటి హీరోలు కూడా కబ్జా సినిమాని ఫ్లాప్ అవ్వకుండా కాపాడలేకపోయారు. మంచి ఓపెనింగ్స్ కి మాత్రమే పరిమితం అయిన కబ్జా సినిమా నెల కూడా తిరగకుండానే ఏప్రిల్ 14న ఒటీటీలోకి రావడానికి రెడీ అయ్యింది. ఆర్ చంద్రు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
పాన్ ఇండియా సినిమా అన్నారు కబ్జా అప్పుడే ఒటీటీలోకి వస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో KFI ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా రేంజులో రిలీజ్ అయిన KGF, కాంతార, చార్లీ 777 సినిమాలు KFIకి సినీ అభిమానుల్లో మంచి రెస్పెక్ట్ ని తెచ్చాయి. ఈ రెస్పెక్ట్ ని కాపాడుకోవాలి అంటే ముందు ముందు మరింత మంచి సినిమాలు చెయ్యాలి. కంటెంట్ అండ్ క్రియేటివిటీని జాగ్రత్తగా బాలన్స్ చేసుకుంటూ సినిమాలు చెయ్యాలి అప్పుడే KFI ఇమేజ్ నిలబడుతుంది. ఈ విషయం మర్చిపోయి విషయం లేని సినిమాలని, పై పై రంగులు అద్దిన సినిమాలని భారి ప్రమోషన్స్ చేసి పాన్ ఇండియా సినిమా అని చెప్పి ఆడియన్స్ పైన రుద్దే ప్రయత్నం చేస్తే మొత్తం యవ్వారమే మారిపోతుంది. KFI ఇమేజ్ అండ్ మార్కెట్ దెబ్బతింటుంది. ఈ విషయాన్ని పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసే ప్రతి కన్నడ ఫిల్మ్ మేకర్ దృష్టిలో పెట్టుకోని సినిమాలు చెయ్యాలి లేదంటే ప్రశాంత్ నీల్, యష్, రిషబ్ శెట్టి లాంటి వాళ్లు కష్టపడి తెచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ వృధాగా పోతుంది.