Yashoda: సమంత.. సమంత.. సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు మారుమ్రోగిపోతోంది. గత కొన్నిరోజుల నుంచి ఆమె సోషల్ మీడియాకు గ్యాప్ ఇచ్చిన విషయం విదితమే.. ఆమె సైలెన్స్ కు కారణం ఏంటో అని అభిమానులు తలలు బద్దలుకొట్టుకొంటున్నారు. ఇక కారణాలు ఇవేనంటూ రోజుకో వార్త నెట్టింట్లో రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ వచ్చాయి. అసలు నిజంగా సమంతకు ఏమైంది..? మళ్లీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఆ ఎదురుచూపులకు నేడు ఫలితం దక్కింది. వినాయక చవితి రోజు సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇచ్చింది సామ్.
ప్రస్తుతం ఆమె నటించిన చిత్రాల్లో యశోద ఒకటి. హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 12 న తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్లు సామ్ చెప్పుకొచ్చింది. దీంతో పాటు ఒక కొత్త పోస్టర్ ను కూడా షేర్ చేసింది. ఇక ఫోటోలో సామ్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తోంది.. ముఖం నిండా గాయాలతో, చుట్టూ మనుషుల మధ్య సీరియస్ లుక్ తో నడుచుకుంటూ కనిపిస్తోంది. ఈ లుక్ చూస్తూనేట్ ది ఫ్యామిలీ మ్యాన్ లో రాజీ గుర్తుకు రాకమానదు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి నేటి నుంచి అయినా సామ్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుందా..? లేదా అనేది చూడాలి.