Ram Charan : టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయినట్టే కనిపిస్తోంది. పెద్ద సినిమాల డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికైతే అధికారిక ప్రకటన రాలేదు. రీసెంట్ గానే రామ్ చరణ్ కు త్రివిక్రమ్ కథ చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని నాగవంశీ అధికారికంగా ప్రకటించాడు. అట్లీ సినిమా తర్వాత ఉండే ఛాన్స్ ఉంది. ఈ లోగా త్రివిక్రమ్ కొందరు హీరోలకు కథలు చెప్పేస్తున్నాడు.
Read Also : Burj Khalifa : బుర్జ్ ఖలీఫాలో ప్లాట్ ఉన్న ఏకైక ఇండియన్ హీరో ఎవరో తెలుసా..?
వెంకటేశ్ తో సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతున్నా ఇంకా అధికారిక ప్రకటన రావట్లేదు. రామ్ చరణ్ తో మూవీకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం చరణ్-బుచ్చిబాబు కాంబోలో పెద్ది మూవీ వస్తోంది. దాని తర్వాత సుకుమార్ తో సాలీడ్ మూవీ ఉంటుందని గతంలోనే క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు త్రివిక్రమ్ పేరు వినిపించడంతో.. సుకుమార్ తర్వాత ఉంటుందా పెద్ది మూవీ తర్వాత ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
కచ్చితంగా సుకుమార్ సినిమా తర్వాతనే ఉండబోతోందంట. ఇప్పటికే సుకుమార్ తో ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఇటు త్రివిక్రమ్ కూడా ఈ ఏడాది వెంకటేశ్ తో మూవీ చేసి ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఆ తర్వాత రామ్ చరణ్ తో మూవీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చరణ్ -సుకుమార్ మూవీ అయిపోవడానికి ఎంత లేదన్నా ఇంకో మూడేళ్లు పడుతుంది. ఆ లోగా వెంకీ, బన్నీతో మూవీలు కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడంట. అతి త్వరలోనే ఏదో ఒక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
Read Also : SSMB 29 : మహేశ్ పాత్రకు రామయణానికి లింక్ ఉందా..?